......అగ్గిమంటలారుతున్నయ్....
సమ సమాజ స్థాపనంటూ...!
సామ్యవాద రాజ్యమంటుపెద్దమాటలెందుకులే....
పేద బతుకులు కుములు తుండగ
కొడిగడుతున్న అరుణ కాంతులకు...
కరి మబ్బులు కమ్ముకోగా...
బూర్జువాలు ఎప్పూడూ అంతే...
మందు బాటిళ్లు, నోట్లకట్టలు పంచుతారంతే...!
అవిలేకే ఓడామని ఓటి మాటలు ఎందుకులే....
పేదల బాధలు గాలికొది...
రొచ్చురాజకీయాలాయే మరి...!!
ఎల్లాగ గెలిచేది సామ్యవాదం..ప్రజాపోరాటాలు లేక
జనంజోలసలే కనరాక అగ్గిమంటలారుతున్నయ్
సీట్ల బేరాలతోపెదబాబుల దోస్తీలతో
గడుపుదాం కాలమింక మండుతున్న
యువత రూటు మారితే మనకేంటి...?
(హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో డబ్బులు లేకే ఓటమి చెందామన్న వామపక్షాల నేతల వ్యాఖ్యాలకు నిరసనగా)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి