8, ఏప్రిల్ 2016, శుక్రవారం
కోయిలా...! ఓ తెలుగు కోయిలమ్మా..!!
చెట్టుకొమ్మన కూస్తున్నవ్ సరే..!
వస్తున్నదా వసంతం..! ఈసారైనా...!!
తొలకరి ఉరిమేనా..! తెలుగు నేలన..!!
తురిమేనా మేఘం సిగలో రంగుల సింగిడీ...!!
అంతా సకాలమేనట కదా ఈసారి..
ఏందీ...! అపుడే వినపిస్తున్నదా రుతురాగం..!!
నైర్రుతి దారుల్లో దుర్ముఖి సింహానాదం..!!
ఏమో కోకిలా...
ఎదుగుతున్నకొద్దీ.. దిగంతాలు చేదెక్కినై
గతిదప్పిన కాలం కంట్లోకారం.. ఎల్నినో లానినో
క్రీనీడల్లో పులుపు వగరుల సౌభాగ్యం..
గొంతుకెండిన జీవం... ఉప్పని కన్నీటి సంద్రం..
అయినా.. పికిలి పిట్టవు..కోయిలా
ప్రతి చిగురాకు తీపే అనుకుంటవ్
రేపటి అంకురంలో అంతా చేదే..!
చిరాకుపుట్టిన వేయిపడగలు...
పడక సర్దుకునే కాలం దాపునే...! భూమాత...
మనిషి స్వార్థానికి సరితూచును తగినఫలితం..
ఓహో... అందుకేనా... ఆగాగి కూస్తున్నవ్..
నువ్వుకూడా...వానపాటే పాడుతున్నవా...
కువ కువల సుకాలం కోసం..!!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి