తడికన్నులు తుడిచితిని..!!
ఇపుడు కాదులే..! అపుడెపుడో..!!
శ్రమజీవనానికి పట్టుగొమ్మను..
చుట్టరికపు పిలుపును..తడి తడి పలకరింపును..
మొగలిరేకల శిగను.. మురిసిన సౌందర్యాన్ని ..!
ఇపుడు కాదులే..! అపుడెపుడో..!!
కంగుమనే రాములోరి గుడిగంటలు
కొలను తామరల ఎరుపు నవ్వులు
ఎండకాలం.. తాతలనాటి రావిచెట్టు..
పై కొమ్మల్లో గొంతెత్తే కోకిల సన్నాయి
ఊరికంతా అది చలువల పందిరి
పులిమేకాటలో ఎత్తుకు పైఎత్తులు
ఆరుగాలం చాకిరికది విరామ కాలం
ఇపుడు కాదులే..! అపుడెపుడో..!!
మండుటెండల్లో జోరెత్తే ఆవిటి వానలు
చిగురాకుల్లో కోయిళ్ల కారుకూతలు
రంకెలేసే దుక్కిటెద్దుకు గుండెగుభిల్లు
ఆరుగాలానికి ఆది... ఆవిటిదుక్కులు
రేయంతా ఎరువుబళ్ల పరుగులు
డొంకదారిలో వడినడకల ఎడ్లబండ్లు
చీకటి దిక్కుల్లో చెలరేగే గాంధర్వం
తాళతోపులో గొంతెత్తిన పద్యం
సైదోడు ఎద్దుగంటల తాళం
శిరసూపును నిషీది సమీరం
ఇపుడుకాదులే..! అపుడెపుడో..!!
రెక్కవిరుచును కారుకోళ్లు
గొంతెత్తును వేకువ జాము
దుమ్ముదులుపును వాకిళ్లన్నీ
ఆకు పచ్చని నిగారం.. ఆవుపేడతో సాన్పి..
మసక వెన్నెల్తో సిగ్గుల సరసం..
విరిసే ముగ్గుల సిరిమల్లెలు
ఇపుడుకాదులే..! అపుడెపుడో..!!
పొగలుకక్కే పొయ్యి మీది బువ్వలు
నట్టింట్లో సల్లకవ్వం హొయలు
చేదబావి గిలకల గానం..
మోటబావి ఆరునొక్కరాగం
చేను దారిలో జనం బారులు..
కొడవలి కొసల్లో పొద్దుపొడుపు మెరుపులు
ఇపుడు కాదులే..! అపుడెపుడో..!!
పొద్దంతా అలసిన వొంటికి..
పొంతకుండలో ఉడుకునీళ్ల స్వాంతన
సందకాడ అందరూ వీధిఅరుగుపై..
కష్టమొచ్చినా, కన్నీరొచ్చినా తలాఇంత..!
గుండెలోని బాధను తుడుచును..
అయినవారి పలకరింపు..!
ఎంత ఆర్థ్రమో..! ఎంత అందమో..!
కష్టసుఖాల్లో కలనేత బతుకుల్లో..
ఇపుడు కాదులే..! అపుడెపుడో..!!
తడికన్నులు తుడిచిన పల్లెను నేను
ఇపుడు కాదులే..! అపుడెపుడో..!!
శ్రమజీవనానికి పట్టుగొమ్మను..
చుట్టరికపు పిలుపును..తడి తడి పలకరింపును..
మొగలిరేకల శిగను.. మురిసిన సౌందర్యాన్ని ..!
ఇపుడు కాదులే..! అపుడెపుడో..!!
కంగుమనే రాములోరి గుడిగంటలు
కొలను తామరల ఎరుపు నవ్వులు
ఎండకాలం.. తాతలనాటి రావిచెట్టు..
పై కొమ్మల్లో గొంతెత్తే కోకిల సన్నాయి
ఊరికంతా అది చలువల పందిరి
పులిమేకాటలో ఎత్తుకు పైఎత్తులు
ఆరుగాలం చాకిరికది విరామ కాలం
ఇపుడు కాదులే..! అపుడెపుడో..!!
మండుటెండల్లో జోరెత్తే ఆవిటి వానలు
చిగురాకుల్లో కోయిళ్ల కారుకూతలు
రంకెలేసే దుక్కిటెద్దుకు గుండెగుభిల్లు
ఆరుగాలానికి ఆది... ఆవిటిదుక్కులు
రేయంతా ఎరువుబళ్ల పరుగులు
డొంకదారిలో వడినడకల ఎడ్లబండ్లు
చీకటి దిక్కుల్లో చెలరేగే గాంధర్వం
తాళతోపులో గొంతెత్తిన పద్యం
సైదోడు ఎద్దుగంటల తాళం
శిరసూపును నిషీది సమీరం
ఇపుడుకాదులే..! అపుడెపుడో..!!
రెక్కవిరుచును కారుకోళ్లు
గొంతెత్తును వేకువ జాము
దుమ్ముదులుపును వాకిళ్లన్నీ
ఆకు పచ్చని నిగారం.. ఆవుపేడతో సాన్పి..
మసక వెన్నెల్తో సిగ్గుల సరసం..
విరిసే ముగ్గుల సిరిమల్లెలు
ఇపుడుకాదులే..! అపుడెపుడో..!!
పొగలుకక్కే పొయ్యి మీది బువ్వలు
నట్టింట్లో సల్లకవ్వం హొయలు
చేదబావి గిలకల గానం..
మోటబావి ఆరునొక్కరాగం
చేను దారిలో జనం బారులు..
కొడవలి కొసల్లో పొద్దుపొడుపు మెరుపులు
ఇపుడు కాదులే..! అపుడెపుడో..!!
పొద్దంతా అలసిన వొంటికి..
పొంతకుండలో ఉడుకునీళ్ల స్వాంతన
సందకాడ అందరూ వీధిఅరుగుపై..
కష్టమొచ్చినా, కన్నీరొచ్చినా తలాఇంత..!
గుండెలోని బాధను తుడుచును..
అయినవారి పలకరింపు..!
ఎంత ఆర్థ్రమో..! ఎంత అందమో..!
కష్టసుఖాల్లో కలనేత బతుకుల్లో..
ఇపుడు కాదులే..! అపుడెపుడో..!!
తడికన్నులు తుడిచిన పల్లెను నేను

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి