5, జూన్ 2010, శనివారం

ఎవరు నువ్వు?

దిగంతాల ఆవల....
అయన రేఖల సంగమంలో
పరచుకున్న శాంతానివా

సిరిచందనాలు వెదజల్లే
జిలుగు రేఖల పద్మానివా

బొండు మల్లెల గుండెల్లో నిండిన
తేనెల చుక్కవా

చల్లని శ్వేత శిఖరాన
వెలిగిన తొలికిరణానివా

మనసు పరితాపానికి
చినుకు లాంటి స్వాంతనవా

యుగాల మధికల్లోలంలో...
రెప్పపాటు ప్రశాంతానివా

ఎవరునువ్వు అపశృతిలో
పొరపాటున దొర్లిన సుస్వరంలా..

కామెంట్‌లు లేవు: