మనుషుల లోకంలో కలకలం
దేవుని కోసం దాడుల దారుణం, బాంబుల హోమం
కేవలం భావనలాంటి మతం కోసం
ఎందుకింత రచ్చ.... కచ్చ
మండుటెండలో గిలిగింతల చలితెమ్మెర ఒకటైతే....
మరొకటి... గొడ్డుచలిలో నులివెచ్చని చలిమంట
అన్నీ మన సౌఖ్యం కోసమే...
ఎక్కువ తక్కువ తకరారులెందుకు
దేవుడొకడే అని చెబుతూ....
ఏదీ ఎక్కవ కాదు మనకంటే.. మనిషికంటే
అందుకే... కలిసుందాం ఏమంటావ్....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి